AP News

ఎస్‌యూవీ డస్టర్‌ కారు పై భారీగా ధర తగ్గించింది

ఆటోమేకర్‌ రెనాల్ట్‌ ఇండియా తన ఎస్‌యూవీ డస్టర్‌పై భారీగా ధర తగ్గించింది. ఈ కారుపై 29,746 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ధర తగ్గింపు అమల్లోకి వస్తుందని గురువారం రెనాల్ట్‌ ఇండియా తెలిపింది. ధర తగ్గింపు అనంతరం పెట్రోల్‌తో నడిచే డస్టర్‌ ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో 7.95 లక్షల రూపాయల నుంచి 9.95 లక్షల రూపాయల వరకు ఉంది. అంతకముందు ఇది 8.5 లక్షల రూపాయల నుంచి 10.24 లక్షల రూపాయలకు లభ్యమయ్యేది.  డీజిల్‌తో నడిచే డస్టర్‌ ... Read More »

తెలంగాణ లో పార్టీ బలోపేతానికై బాబు దృష్టి

  తెలంగాణలో పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేయాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రెండో రోజు పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై… నేతలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర నాయకత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. పల్లె పల్లెకు తెలుగు దేశం కార్యక్రమాన్ని మార్చి 29 వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకత్వం నేరుగా ప్రజల్లోకి వెళ్తే కార్యకర్తల్లో కూడా ధైర్యం వస్తుందని… త్వరలోనే ఖమ్మంలో బహిరంసభకు తాను హాజరవుతానని చెప్పారు. మహానాడు లోపు మూడు బహిరంగ సభలు నిర్వహించాలని ... Read More »

శ్రీదేవి అంతిమయాత్రపై వర్మ ట్వీట్‌

ముంబయి: అతిలోక సుందరి శ్రీదేవి చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె అంతిమయాత్ర సెలబ్రేషన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ నుంచి ప్రారంభమై, శ్మశానవాటిక వరకు కొనసాగింది. రోడ్డుపై పెద్ద ఎత్తున అభిమానులు చేరి, తమ అభిమాన నటికి కన్నీటితో అంతిమ వీడ్కోలు చెప్పారు.  . శ్రీదేవి అంటే తనకు ఎంతో ఇష్టమని అనేక సందర్భాల్లో చెప్పిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. ఇదే జనం (అభిమానులు) శ్రీదేవి నటన, డ్యాన్స్‌ చూడటానికి థియేటర్లో కూర్చొనే వారని, ఇప్పుడు ఆమె చుట్టూ అదే జనం చేరి పగిలిన హృదయాలతో కన్నీటి వీడ్కోలు చెబుతున్నారని ... Read More »

“నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” పోస్టర్ చాలా స్టైలిష్

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్‌ ఇంపాక్ట్‌ అంటూ విడుదల చేసిన టీజర్‌ కుర్రకారును తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు చిత్రబృందం ఫస్ట్‌ ఇంపాక్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో బన్నీ జీపులో కూర్చుని స్టీరింగ్‌ తిప్పుతూ..నోట్లో సిగార్‌తో చాలా ‘స్టైలిష్’గా కన్పిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సైనికుడి పాత్రలో నటిస్తున్నారు. కశ్మీర్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. ... Read More »

అందాల నటికి కన్నీటి వీడ్కోలు

అతిలోక సుందరి ఇక తిరిగిరాని లోకాలకు మరలిపోయింది. నాలుగు రోజుల క్రితం హఠాన్మరణంతో అభిమాన లోకాన్ని హతాశుల్ని చేసిన శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం  మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. విల్లేపార్లే ఎస్వీరోడ్డులోని ‘విల్లేపార్లే సేవా సమాజ్‌ శ్మశానవాటికలో’ హిందూ సంప్రదాయపద్ధతిలో సాయంత్రం సుమారు 5.30 ప్రాంతంలో కుమార్తెలు ఖుషి, జాన్వి చెంతన ఉండగా శ్రీదేవి భర్త బోనీకపూర్‌ ఆమె చితికి నిప్పంటించారు. ఇతర కుటుంబసభ్యులు, సన్నిహితులు కూడా అక్కడే ఉన్నారు. అంత్యక్రియలకు అనేక మంది బాలీవుడ్‌ ప్రముఖులు హాజరై శ్రీదేవికి బరువెక్కిన హృదయంతో ... Read More »

Timber by EMSIEN 3 Ltd BG