శ్రీదేవి అంతిమయాత్రపై వర్మ ట్వీట్‌

ముంబయి: అతిలోక సుందరి శ్రీదేవి చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె అంతిమయాత్ర సెలబ్రేషన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ నుంచి ప్రారంభమై, శ్మశానవాటిక వరకు కొనసాగింది. రోడ్డుపై పెద్ద ఎత్తున అభిమానులు చేరి, తమ అభిమాన నటికి కన్నీటితో అంతిమ వీడ్కోలు చెప్పారు.  .

శ్రీదేవి అంటే తనకు ఎంతో ఇష్టమని అనేక సందర్భాల్లో చెప్పిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. ఇదే జనం (అభిమానులు) శ్రీదేవి నటన, డ్యాన్స్‌ చూడటానికి థియేటర్లో కూర్చొనే వారని, ఇప్పుడు ఆమె చుట్టూ అదే జనం చేరి పగిలిన హృదయాలతో కన్నీటి వీడ్కోలు చెబుతున్నారని వర్మ అన్నారు. యాత్రలో తీసిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘సినీ దేవతకు తుది వీడ్కోలు’ అని ట్వీట్‌ చేశారు.

దుబాయ్‌లో శ్రీదేవి మరణించారన్న వార్త తెలియగానే వర్మ చాలా బాధపడ్డారు. దేవుడు తనను ఇక్కడే వదిలేసి శ్రీదేవిని మాత్రమే తీసుకెళ్లాడని, అందుకే ఆయన మీద కోపం వస్తోందని ట్వీట్‌ చేశారు.

 

సినిమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Timber by EMSIEN 3 Ltd BG