*మేయ‌ర్‌చే నేడు రోజ్ గార్డెన్ ప్రారంభం*

*మేయ‌ర్‌చే నేడు రోజ్ గార్డెన్ ప్రారంభం*
 
  ల‌క్డికాపూల్ జంక్ష‌న్‌లో రూ. 30ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన రోజ్ గార్డెన్‌ను న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ శుక్ర‌వారం సాయంత్రం 6గంట‌ల‌కు ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి కూడా హాజ‌ర‌వుతారు.  నిన్న‌టిదాక‌ పాత‌ వాహనాలు, వ్యర్డాలతో ఉన్న‌ల‌క్డికాపూల్ జంక్ష‌న్‌లోని ఖాళీ స్థ‌లంలో అందమైన గులాబీ గార్డెన్‌ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. లక్డికాపూల్ పాత సైఫాబాద్ పోలీస్ స్టేష‌న్ ఉన్న స్థ‌లంలో పోలీస్‌స్టేష‌న్ కూల్చివేయ‌డంతో కాళీగా ఉన్న స్థ‌లం నిరుపయోగంగా ఉండి ఐదు రూపాయల అన్నపూర్ణ క్యాంటీన్ న‌డిచేది. లక్షలాది ప్రజానికం, వేలాది వాహనాలు నిరంతరం ప్ర‌యాణించే మార్గంలో ఆ స్థ‌లం నిరుపయోగంగా, అందహీనంగా ఉండ‌డాన్ని ఆ మార్గంలో ప్ర‌యాణించిన‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గమనించి, ఆ స్థ‌లంలో మంచి ఉద్యాన‌వ‌నాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డిని ఆదేశించారు. దీంతో పలు రకాల నమూనాలను ప‌రిశీలించి గులాబీ ఫౌంటెన్ తో కూడిన గార్డెన్‌ను ఏర్పాటు చేయ‌డానికి నిర్ణ‌యించారు. దీనితో పెద్ద గులాబీ పువ్వు ఆకృతితో రంగురంగుల లైటింగ్‌తో కూడిన ఫౌంటెన్, వెనుక వైపు అంద‌మైన‌ చెట్ల వరుస, రంగు రంగుల సీజ‌న‌ల్‌ పూల వ‌నాల‌తో ఆక‌ర్ష‌నీయ ఉద్యాన‌వ‌నం రూపు దిద్దుకుంది. గార్డెన్ చుట్టూ ప్యారాపీట్ గోడ నిర్మాణంతో పాటు స్టీల్ రేలింగ్ నిర్మించారు. అదే ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ను తొల‌గించి రంగులు మారే ఫౌంటెన్‌ల‌ను, ప‌లు ర‌కాల సీజ‌న‌ల్ పూల‌మొక్క‌ల‌ను ఈ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు.  దీని నిర్మాణంతో లక్డికాపూల్ జంక్షన్ మరింత సుందరంగా, ఆహ్లాదకరంగా మార‌డంతో పాటు న‌గ‌ర‌వాసుల‌కు మంచి సెల్ఫీ కేంద్రంగా మార‌నుంది.
******

Womens day is a Constructive Platform to create Ray of Hope in their Lives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Timber by EMSIEN 3 Ltd BG