“నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” పోస్టర్ చాలా స్టైలిష్

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్‌ ఇంపాక్ట్‌ అంటూ విడుదల చేసిన టీజర్‌ కుర్రకారును తెగ ఆకట్టుకుంది. ఇప్పుడు చిత్రబృందం ఫస్ట్‌ ఇంపాక్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

పోస్టర్‌లో బన్నీ జీపులో కూర్చుని స్టీరింగ్‌ తిప్పుతూ..నోట్లో సిగార్‌తో చాలా ‘స్టైలిష్’గా కన్పిస్తున్నారు.

ఈ సినిమాలో బన్నీ సైనికుడి పాత్రలో నటిస్తున్నారు. కశ్మీర్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. లగడపాటి శ్రీధర్‌, బన్నివాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశాల్‌-శేఖర్‌ బాణీలు సమకూరుస్తున్నారు. మే 4న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది


మరోపక్క ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులకు మంచి డిమాండ్‌ ఏర్పడినట్లు సమాచారం. ఓ ఛానెల్‌ రూ.24 కోట్లతో హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ హక్కులను కూడా ఇదే సంస్థ కొన్నదట.

******

Gorgeous Actress Shriya Saran Is Soon Going To Marry Andrei Koscheev

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Timber by EMSIEN 3 Ltd BG