తెలంగాణ లో పార్టీ బలోపేతానికై బాబు దృష్టి

 Image result for chandrababu naidu

తెలంగాణలో పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేయాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రెండో రోజు పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై… నేతలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర నాయకత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. పల్లె పల్లెకు తెలుగు దేశం కార్యక్రమాన్ని మార్చి 29 వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకత్వం నేరుగా ప్రజల్లోకి వెళ్తే కార్యకర్తల్లో కూడా ధైర్యం వస్తుందని… త్వరలోనే ఖమ్మంలో బహిరంసభకు తాను హాజరవుతానని చెప్పారు. మహానాడు లోపు మూడు బహిరంగ సభలు నిర్వహించాలని నేతలు సూచించగా… బాబు ఓకే చెప్పారు.

పొత్తుల అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడుకుందామని… ప్రస్తుతం పార్టీ బలోపేతంపై అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో పార్టీకి అండగా ఉంటానని… కొందరు నేతలు పార్టీ వీడినంత మాత్రానా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. మే నెలాఖరు నాటికి నియోజకవర్గా కమిటీల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే గ్రామ స్థాయిలో కూడా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Timber by EMSIEN 3 Ltd BG