తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో  భారీ ఎన్‌కౌంటర్

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో  శుక్రవారం  తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి జిల్లా చర్ల మండలం తొండపాల్ వద్ద పోలీసులకు మావోలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు. తొండపాల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం పన్నెండు మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మ‌ర‌ణించిన వారిలో ఆరుగురు మ‌హిళ‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ మరణించాడు .ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో  శుక్రవారం  తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి జిల్లా చర్ల మండలం తొండపాల్ వద్ద పోలీసులకు మావోలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు. తొండపాల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఎన్ కౌంటర్ పై హైకోర్టులో పిటిషనర్

తెలంగాణ ఛత్తీస్ గఢ్ లో ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలంటూ లంగాణ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు. మృతదేహాలను భద్రపరిచి న్యాయ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని పిటిషన్లో పేర్కొన్న పౌర హక్కుల సంఘం నేతలు. మావోయిస్టుల మృతదేహాలను వరంగల్ ఎంజీఎంలో గానీ గాంధీ మార్చిలో గానీ పోస్టుమార్టం నిర్వహించాలని కోరిన పిటిషనర్లు .

ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషనర్

ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతోనే పక్క ప్లాన్ వేసి కుంబింగ్ చేసిన పోలీసులు ఎన్‌కౌంట‌ర్ల‌కు పాల్ప‌డ్డార‌ని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు.

********

Allu Arjun Working towards release of Upcoming Cinema ‘Naa Peru Surya’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Timber by EMSIEN 3 Ltd BG