*డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌ను మ‌రింత వేగ‌వంతం*

*డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌ను మ‌రింత వేగ‌వంతం*
 
   హైద‌రాబాద్ న‌గ‌రంలో నిరుపేదలు ఆత్మ‌గౌర‌వంతో జీవించేందుకు జీహెచ్ఎంసీ చేప‌ట్టిన ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌ను మ‌రింత వేగ‌వంతంగా పూర్తి చేసి ల‌బ్దిదారుల‌కు అందించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్ ప‌రిపాల‌న ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి అర‌వింద్‌కుమార్ అన్నారు. నేడు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డితో క‌లిసి ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్‌కుమార్ అహ్మ‌ద్‌గూడ‌లో నిర్మిస్తున్న 4,041 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య కార్య‌ద‌ర్శి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు న‌గ‌రంలో ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. అహ్మ‌ద్‌గూడ‌లో నిర్మిస్తున్న 4,041 ఇళ్ల నిర్మాణం పూర్తితో ప్ర‌త్యేక టౌన్‌షిప్ ఏర్ప‌డుతుంద‌ని అన్నారు. గ్రేట‌ర్‌లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను మ‌రింత వేగ‌వంతంగా చేప‌ట్టేందుకు ఇక నుండి ప్ర‌తి గురువారం డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జ‌రిగే ప్రాజెక్ట్‌ల వ‌ద్ద‌కు వెళ్లి ప‌నుల పురోగ‌తిని స‌మీక్షించనున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా అహ్మ‌ద్‌గూడ‌లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ ప‌నులను అర‌వింద్‌కుమార్ ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. చీఫ్ ఇంజ‌నీర్ సురేష్‌, గృహ‌నిర్మాణ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Timber by EMSIEN 3 Ltd BG