అందాల నటికి కన్నీటి వీడ్కోలు

తిలోక సుందరి ఇక తిరిగిరాని లోకాలకు మరలిపోయింది. నాలుగు రోజుల క్రితం హఠాన్మరణంతో అభిమాన లోకాన్ని హతాశుల్ని చేసిన శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం  మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. విల్లేపార్లే ఎస్వీరోడ్డులోని ‘విల్లేపార్లే సేవా సమాజ్‌ శ్మశానవాటికలో’ హిందూ సంప్రదాయపద్ధతిలో సాయంత్రం సుమారు 5.30 ప్రాంతంలో కుమార్తెలు ఖుషి, జాన్వి చెంతన ఉండగా శ్రీదేవి భర్త బోనీకపూర్‌ ఆమె చితికి నిప్పంటించారు. ఇతర కుటుంబసభ్యులు, సన్నిహితులు కూడా అక్కడే ఉన్నారు. అంత్యక్రియలకు అనేక మంది బాలీవుడ్‌ ప్రముఖులు హాజరై శ్రీదేవికి బరువెక్కిన హృదయంతో కన్నీటి వీడ్కోలు పలికారు. అభిమానులు, మీడియాను లోపలకి అనుమతించలేదు. అధికార లాంఛనాల్లో భాగంగా తుపాకులు గాల్లోకి పేల్చి, చితికి బోనీకపూర్‌ నిప్పటించగానే పలువురు కన్నీటిని దిగమింగుకుంటూ కనిపించారు. శ్మశానవాటిక బయట వేల మంది ప్రజలు గుమిగూడారు. వారిని నియంత్రించడానికి పోలీసులు కష్టపడ్డారు. షారుక్‌ ఖాన్‌ వంటి పలువురు సెలబ్రిటీలు, అనిల్‌ కపూర్‌ కుమార్తె సోనమ్‌ కపూర్‌ కూడా తమ వాహనాల్లోంచి దిగి శ్మశానవాటిక వద్దకు నడిచి వెళ్లాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Timber by EMSIEN 3 Ltd BG